వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ యూజీ 2024 ఫలితాలను పరీక్షా కేంద్రాలు, నగరాల వారీగా వివరాలు ప్రకటించాలని సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీని ఆదేశించింది. జులై 20వ తేదీ మధ్యాహ్నం సమయానికి అన్ని వివరాలు వెబ్‌సైట్లో పెట్టాలని సర్వోన్నత న్యాయస్థానం నేషనల్ టెస్టింగ్ ఏజన్సీని తాజాగా ఆదేశించింది.
నీట్ యూజీ ఫలితాలు, పరీక్ష నిర్వహణపై అనేక ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారిస్తోన్న న్యాయస్థానం పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలు ప్రకటించాలని ఆదేశించింది. తదుపరి ఈ నెల 22న సుప్రీంకోర్టు కేసు
విచారణ చేయనుంది.