త్వరలోనే అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే నెల 10 నాటికి చాలా చోట్ల పనులు పూర్తవుతాయన్నారు. అన్ని అన్న క్యాంటీన్లు ఒకే మోడల్‌లో ఉంటాయని, రూ.5కే అల్పాహారం, భోజనం అందజేస్తామన్నారు.
మురికి కాల్వల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సూచించిన మంత్రి నారాయణ, పిడుగురాళ్లలో నీరు కలుషితమై వందమందికి డయేరియా సోకిందన్నారు. పైపులు మరమ్మతుల కారణంగా కొన్ని చోట్లు ఇబ్బందులు తలెత్తాయన్నారు. సిల్ట్ తీసేందుకు 106 పురపాలక సంఘాలకు రూ.50 కోట్లు విడుదల చేశామన్నారు. సిల్ట్ తీయడంతోపాటు, 24 గంటల్లో దానిని తరలించాలన్నారు. చెత్తపన్ను అంశంపై సీఎంతో మాట్లాడి నిర్ణయం వెల్లడిస్తామన్నారు.