జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు నేపథ్యంలో భద్రతకు సంబంధించిన కేబినెట్ కమిటీతో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. దోడా జిల్లాలో తాజా ఉగ్రకాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడిన కొన్ని గంటల్లోనే ప్రధాని అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు జిల్లాలైన కఠువా, దోడాలో వరుస దాడులు జరుగుతున్నాయి. గడిచిన 32 నెలల్లో జరిగిన దాడుల్లో దాదాపు 50 మంది భద్రతా సిబ్బందితో పాటు సాధారణ పౌరులు కూడా చనిపోయారు.
నాలుగు నెలల్లోనే దాదాపు ఐదుమార్లు భారీ ఉగ్రదాడులు జరిగాయి. ఇటీవల జరిగిన దాడిలో ఆర్మీ కెప్టెన్‌తో పాటు 12 మంది భద్రతా సిబ్బంది వీరమరణం చెందారు. ఉగ్రదాడులుకు భారత సైన్యం కూడా ధీటుగా బదులిస్తోంది. అనుమానాస్పద ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టి ముష్కరుల ఆట కట్టిస్తున్నారు.