ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నాలుగు శాఖలపై ఇప్పటికే శ్వేత పత్రాలు విడుదల చేసింది. మరో మూడు శాఖలకు సంబంధించిన శ్వేత పత్రాలను అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని నిర్ణయించింది. శాంతిభద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖలపై శ్వేతపత్రాలు అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయనున్నారు.
ఇప్పటికే నీటిపారుదల ప్రాజెక్టులు, అమరావతి రాజధాని, విద్యుత్, గనుల శాఖలపై శ్వేత పత్రాలను సీఎం చంద్రబాబునాయుడు విడుదల చేశారు. మరో మూడు శాఖలకు సంబంధించిన శ్వేత పత్రాలను రూపొందించే కార్యక్రమం జరుగుతోంది. ప్రతిపక్ష హోదా లేని వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో మూడు శ్వేత పత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.