అక్టోబరు 4 నుంచి 12 వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని అక్టోబరు 4 నుంచి 12 వరకు పలు సేవలు రద్దు చేశారు. అక్టోబరు 4 నుంచి 10 వరకు సుప్రభాత ఆర్జిత సేవలు మినహా అన్ని రద్దు చేశారు. 11, 12 తేదీల్లో అన్ని సేవలు రద్దు చేశారు. వర్చువల్ సేవలు, అంగ ప్రదక్షిణలు 3వ తేదీ నుంచే రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఆర్జిత సేవలు, ఎస్ఈడీ టికెట్లు అక్టోబర్ 18 నుంచి విడుదల చేయనున్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలో ఏటా ప్రత్యేక ఆర్జిత సేవలను రద్దు చేస్తూ ఉంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం సుప్రభాత సేవలు మాత్రమే అందించనున్నారు. అక్టోబరు 11,12 తేదీల్లో అన్ని సేవలు రద్దు విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ ఈవో సూచించారు.