అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ భారినపడ్డారు. లాస్‌వెగాస్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారించారు. వెంటనే బైడెన్ ఎన్నికల ప్రచారం నిలిపివేసి, డెలావర్ సముద్రతీరంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. బైడెన్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో మందులు తీసుకుంటున్నారు.
తనకు తీవ్ర అనారోగ్యం వస్తే అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతానంటూ ప్రకటన చేసి 24 గంటలు కాక ముందే బైడెన్‌కు కోవిడ్ లక్షణాలు బయటపడటం గమనార్హం. లాస్‌వెగాస్‌లో ఎన్నికల ప్రచారం నిలిపివేసి, డెలావర్ వెళ్లేందుకు ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కే సమయంలో ఆయన మాస్క్ ధరించపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.