ఎన్‌హెచ్‌ఎం కింద ప్రత్యేకంగా రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖమంత్రి సత్యకుమార్ వెల్లడించారు. దిల్లీ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. ‘ఆరోగ్య మందిర్’ భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై కూడా కేంద్రపెద్దలతో చర్చించినట్లు సత్యకుమార్ తెలిపారు. 40 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి కేంద్ర మంత్రులు అడిగి తెలుసుకున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ సామాజిక పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం, అన్న క్యాంటీన్లు, స్కిల్ సెన్సస్ అమలు గురించి వివరించినట్లు తెలిపారు.