సింహం ఆకారంలో ఉన్న సింహగిరి క్షేత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. సింహాచలం గిరి ప్రదక్షిణతో సర్వ పాపాలు హరించుకుపోవడంతో పాటు సుఖసంతోషాలు, భోగభాగ్యాలు లభిస్తాయని నమ్ముతారు.
ఈనెల 20న శనివారం సింహగిరి ప్రదక్షిణ ఉత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తొలిపావంచ వద్ద అప్పన్న పుష్పరథం బయలు దేరుతుంది. భక్తులు అక్కడ స్వామికి నారికేళం సమర్పించి కాలినడకన తమ గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. అక్కడ నుంచి పాత అడవివరం, ముడసర్లోవ, హనుమంతవాక జంక్షన్, పాత వెంకోజీ పాలెం చేరుకుంటారు. సాగర తీరంలో పుణ్య స్నానాలు ఆచరించి, అప్పు ఘర్, ఇసుకతోట, సీతమ్మధార, మాధవధార గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం తొలిపావంచ వద్దకు చేరుకుంటారు. స్వామికి మళ్లీ నారికేళం సమర్పించి దీక్ష పూర్తి చేస్తారు.
అనంతరం సిరులు ప్రసాదించే సింహాద్రినాథుడిని భక్తులు దర్శించుకుంటారు. ఆషాడ పౌర్ణమి సందర్భంగా ఆఖరి విడత చందన సమర్పణ ఈ నెల 21న జరగనుంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు