ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు నెల్లూరులోని స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ జరుగుతుంది. నెత్తి మీద రొట్టె పెట్టుకుని చెరువులోకి దిగి, కావలసిన కోరిక కోరుకుని ఆ రొట్టెను మరొకరికి ఇవ్వాలి. కోరిక తీరాక మరుసటి ఏడాది మళ్ళీ అదే సమయంలో మరొక రొట్టెను దానమివ్వాలి. బారాషహీద్ దర్గాలోని 12మంది అమరులైన ముస్లిములకు గంధం సమర్పించి ఉత్సవం చేయాలి. అప్పుడు అల్లా కరుణించి, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం.
ఈ రొట్టెల పండుగలో ముస్లిముల కంటె హిందువులే పెద్దసంఖ్యలో హాజరవుతుంటారు. తమ కోరికలు తీర్చుకోడానికి రొట్టెలు మార్చుకుంటుంటారు. అయితే ఈ పండుగ వెనుక ఉన్న అసలు కథ చాలామందికి తెలియదు. హిందువులను ఊచకోత కోస్తూ వారిని మతం మారుస్తున్న 12మంది ముస్లిం ఇమాములను నెల్లూరు జిల్లాలో కొందరు మాదిగలు ఎదుర్కొన్నారు. అప్పుడు జరిగిన యుద్ధంలో ముస్లిములను హతమార్చారు. వారిని అమరవీరులుగా పేర్కొంటూ వారికి సమాధులు కట్టారు. వారికి మహత్తులు అంటగట్టి, రొట్టెలు పంచుకుంటే కోర్కెలు తీరతాయని ప్రచారం చేసారు. ఆ ప్రచార మాయకు, లౌకికవాదం అనే అబద్ధాల మత్తుమాటలకు లోబడిపోయిన హిందువులు ఈ పండుగలో పాల్గొంటున్నారు. తమ పూర్వీకులను లక్షలాది మందిని హతమార్చినవారిని అమరవీరులుగా భావిస్తూ, వారికి పూజలు చేస్తున్నారు.
సామాన్య శకం 18వ శతాబ్దంలో సౌదీఅరేబియా నుంచి ఇస్లాం మతవ్యాప్తికి భారతదేశంలోకి పలువురు ముస్లిములు వచ్చారు. లొంగినవారిని మతం మార్చడం, లొంగనివారిని కత్తికో కండగా నరకడం ఇదే వారి పద్ధతి. హిందువుల దేవాలయాలను ధ్వంసం చేస్తూ, హిందూ స్త్రీల మానప్రాణాలను హరిస్తూ పరమ కిరాతకంగా తమ మతాన్ని విస్తరింపజేసుకుంటూ దక్షిణభారతదేశానికి సైతం చేరుకున్నారు. ఆ క్రమంలో కొందరు ముస్లిములు నెల్లూరు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి ప్రజలపై తమ దాష్టీకాలకు పాల్పడ్డారు. సామాన్యశకం 11వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు నెల్లూరులో చెరువు తవ్వించాడు. దాని గట్టు మీద శివాలయం కట్టించాడు. ఆ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా గండవరం గ్రామంలో మాదిగలు ఎక్కువమంది ఉండేవారు. ఆ ప్రాంతం మీద కూడా తురుష్క ముష్కరులు దాడులు చేసారు.
ఆ గ్రామాల్లోని సాధారణ ప్రజలపై ముస్లిములు ఎన్నో అమానుష అఘాయిత్యాలకు పాల్పడ్డారు. చిన్నపిల్లలు, గర్భిణులతో సహా మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడడం, పురుషులను చిత్రహింసలు పెట్టి చంపేయడం, లొంగిపోయినవారిని మతం మార్చడం… ఇదే వారి పని.
గండవరం గ్రామంలోని మాదిగలు ముస్లిముల దురాగతాలను అడ్డుకున్నారు. వీరయ్య అనే మాదిగ వీరుడి నేతృత్వంలో తమ గ్రామంపై దాడులు చేస్తున్నముస్లిములపై ప్రతిదాడికి పాల్పడ్డారు. ఆ క్రమంలో కొందరు ముస్లిములు చనిపోగా, మరికొంతమంది పారిపోయారు. వారిని వెంబడిస్తూ వీరయ్య, అతని అనుచరులు నెల్లూరు స్వర్ణాల చెరువు దగ్గరకు చేరుకున్నారు. అక్కడి దుస్థితిని ప్రత్యక్షంగా చూసారు. ముస్లిం దుండగులు శివాలయాన్ని ధ్వంసం చేసి, శివలింగాన్ని కూడా పగలగొట్టడానికి ప్రయత్నించారు. అది పగలకపోవడంతో దాన్ని చెరువులో పడేసారు.
విషయం గ్రహించిన వీరయ్య, అతని అనుచరులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై, కత్తికి పనిచెప్పారు. తమ పూజాక్షేత్రమైన శివాలయాన్ని ధ్వంసం చేసిన 12మంది ముస్లిం మతప్రచారకులు, వారి అనుచరులతో యుద్ధం చేసి వారందరినీ చంపేసారు. ఆ యుద్ధంలోనే తీవ్రగాయాలపాలైన వీరయ్య సైతం ప్రాణాలు కోల్పోయాడు, అక్కడే అమరుడయ్యాడు.
ఆ సమయంలో కర్ణాటకలో హైదర్ అలీ, నెల్లూరులో నవాబులు పరిపాలిస్తుండడంతో… శివాలయాన్ని ధ్వంసం చేసి, హిందూ మాదిగ వీరుల ఆగ్రహజ్వాలల్లో ప్రాణాలు కోల్పోయిన తురుష్కులను బారహ్ షహీద్ (12మంది వీరులు) అని పేర్కొంటూ వారి పేరిట అక్కడ బారహ్ షహీద్ దర్గా నిర్మించారు.
కాలక్రమంలో అసలు చరిత్ర మరుగున పడిపోయింది. హిందువులను చంపడానికి వచ్చిన దుర్మార్గుల సమాధులే దర్గాగా మారిపోయాయి. రొట్టెల పండుగ పేరిట ఓ కృత్రిమ పండుగను సృష్టించారు. లౌకికత్వపు మాయలో స్వత్వం కోల్పోయిన హిందువులు, కోరికలు తీరతాయనే భ్రమతో ఆ పండుగలో పాల్గొంటూ తమ పూర్వీకులను ఊచకోత కోసిన దుర్మార్గుల సమాధులకు మ్రొక్కుతున్నారు.
ఇటీవలే కొద్దికొద్దిగా హిందువుల్లో చైతన్యం వస్తుండడంతో ఈ రొట్టెల పండుగలోనూ, బారా షహీద్ దర్గాలో ‘గంధోత్సవం’ అంటూ జరిపే వేడుకల్లోనూ పాల్గొనడం తగ్గిస్తున్నారు. ఆ చైతన్యం యావత్ హిందూ సమాజంలో రావాలి. కృత్రిమ పండుగల్లో పాల్గొంటూ మన పూర్వీకులను చంపినవారి పేరిట జరిపే పండుగల్లో పాల్గొనడం పూర్తిగా మానివేయాలి.
స్వర్ణాల చెరువులో శివలింగం కొంతకాలం క్రితం బైటపడింది. ఆ ప్రాంతంలో దేవాలయం నిర్మించాలని స్థానిక హిందువులు కోరితే, ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడ దేవాలయం నిర్మించకుండా అడ్డుపడతానంటూ, హిందువే అయిన స్థానిక ఎమ్మెల్యే స్పష్టం చేసారు. దాన్నిబట్టే ప్రాంతీయ రాజకీయ పార్టీల ముస్లిం సంతుష్ఠీకరణ ఎంత ప్రమాదకరస్థాయికి చేరుకుందో అర్ధం చేసుకోవచ్చు.
మాట మాట్లాడితే హిందువుల ఆచార వ్యవహారాల్లో శాస్త్రీయత లేదంటూ, వాటిని నిలిపివేయాలంటూ వాదనలు చేసే వామపక్ష మేధావులు, నాస్తిక సమాజాలూ ఈ రొట్టెల పండుగ విషయంలో కిక్కురుమనవు. నోరు విప్పి మాట్లాడవు. మతమార్పిడి ముఠా శవాలకు దండాలు పెట్టుకుని, చెరువునీటిలో మునిగి రొట్టెలు పంచుకుంటే కోరికలు ఎలా తీరతాయన్న విషయం గురించి విమర్శలు చేయవు. అటువంటి ద్వంద్వ ప్రమాణాల మేధావులను, వారి ఏకపక్ష లౌకికవాదాన్ని బైటపెట్టడం అసలైన హిందువులు చేయవలసిన నిజమైన ధార్మిక సేవ.