ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్‌లో విషాదం చోటుచేసుకుంది. వసంత కెమికల్స్ కంపెనీలో ఉదయం రియాక్టర్ పేలడంతో ఓ కార్మికుడు మృతిచెందాడు. మరికొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనలో భయాందోళనకు గురైన కార్మికులు కంపెనీ నుంచి బయటకు పరుగులు పెట్టారు. రియాక్టర్ అధికంగా వేడెక్కడంతోనే పేలుడు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌కు హోంమంత్రి అనిత ఫోన్ చేసి ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
2022 అక్టోబర్ లోనూ రాంబిల్లి సెజ్‌లో విషాద ఘటన జరిగింది.సెయింట్ గోబెన్ కంపెనీలో గ్యాస్ లీకు కావడంతో ఎలక్ట్రికల్ ఇంజినీర్ సజీవ దహనం అయ్యాడు.