ఒమన్ తీరంలో చమురు నౌక బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 13 మంది భారతీయులు సహా ముగ్గురు శ్రీలంకవాసులు గల్లంతు అయ్యారు. కొమొరస్ జెండాతో ప్రయాణిస్తున్న ‘ప్రెస్టీజ్ ఫాల్కన్’ కడలి లో మునిగిపోయనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నౌక మునిగిపోతున్నట్టు సముద్ర భద్రతా కేంద్రం ప్రకటించిన 24 గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో చమురు, దానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులకు ఏమేరకు నష్టం వాటిల్లిందనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
నౌక ఒమన్ ప్రధాన పారిశ్రామిక పోర్టు అయిన దుక్మలో బోల్తాపడింది. ఈ నౌక పొడవు 117 మీటర్లు కాగా, 2007లో దీనిని రూపొందించారు. తీరప్రాంత ప్రయాణాల కోసం ఇలాంటి నౌకలను ఉపయోగిస్తారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు