పార్లమెంట్ ఉభయసభల్లోని అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అన్నిపార్టీల ఫ్లోర్ లీడర్లను బడ్జెట్ సెషన్, సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్రప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ హాజరు కావడం లేదు. జులై 21న పశ్చిమబెంగాల్ రాష్ట్ర అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నందున సమావేశానికి హాజరుకావడం లేదని టీఎంసీ వెల్లడించింది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు జూలై 22న ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తాయి. జూలై 23న బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
కేంద్రఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ సృష్టించనున్నారు. వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె.. 2024-25 బడ్జెట్‌ను సమర్పించనున్నారు. మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. వరుసగా ఏడు కేంద్ర బడ్జెట్‌లను సమర్పించిన ఘనత ఆమె సొంతం అవుతుంది.
కేంద్ర మంత్రివర్గంలో మూడోసారి వరుసగా చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నేతగా నిర్మలా సీతారామన్ ఉన్నారు.