సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు జడ్జిలను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. జస్టిస్ ఎన్.కోటేశ్వరసింగ్, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జునరామ్ మేఘ్వాల్ వెల్లడించారు. కొలీజియం సిఫార్సుల మేరకు ఇద్దరు జడ్జిలను నియామయం చేసినట్లు ఆయన తెలిపారు.
జస్టిస్ ఎన్.కోటేశ్వరసింగ్ మణిపుర్‌కు చెందిన వారు. మణిపుర్ నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా నియామకమైన మొదటి వ్యక్తి కూడా జస్టిస్ కోటేశ్వరసింగ్ కావడం విశేషం. ఆయన ప్రస్తుతం జమ్ము, లడ్డాక్ చీఫ్ జస్టిస్‌గా పనిచేస్తున్నారు. జస్టిస్ ఆర్. మహాదేవన్ తమిళనాడుకు చెందిన వారు. ప్రస్తుతం చెన్నై హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా చేస్తున్నారు.