ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు కొత్త ఇసుక విధానం అమలుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన ఇసుక పాలసీ అమలుకు విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించిన కేబినెట్, పౌరసరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు అంగీకారం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.