ఆహార పదార్థాల డెలివరీ కంపెనీ జొమాటో రూ.2 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. అనతి కాలంలోనే జొమాటో 2 లక్షల కోట్ల మార్కెట్ విలువకు చేరుకోవడంలో ఆ కంపెనీ అధినేత, సీఈవో దీపీందర్ గోయల్ విశేషంగా కృషి చేశారు. ఏడాది కిందట రూ.76గా ఉన్న కంపెనీ షేరు నేడు రూ.232కు చేరింది. అంటే ఏడాదిలోనే కంపెనీలో లక్ష పెట్టుబడి పెట్టిన వారు, నేడు రూ.3 లక్షల ఆదాయం పొందారు.
దేశంలో అత్యంత వేగంగా ఎదిగిన కంపెనీల్లో నైకా తరవాత జొమాటో చేరింది. అయితే నైకాలో గోయల్‌కు 52శాతం వాటాలున్నాయి. జొమాటాలో గోయల్ వాటా కేవలం 4 శాతం మాత్రమే. రాబోయే కొద్ది రోజుల్లో తక్కువ మత్తునిచ్చే మద్యం డోర్ డెలివరీ చేసేందుకు పలు రాష్ర ప్రభుత్వాలతో జొమాటో చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఒడిషా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో తక్కువ మత్తునిచ్చే బీరు, విస్కీలను డోర్ డెలివరీ చేస్తోంది.