తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవల కోసం ఈ నెల 18 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ టికెట్ల విక్రయం చేపట్టనున్నారు. ఈ నెల 20 వరకు కొనసాగనుంది. ఆర్జిత సేవల టికెట్లకు లాటరీ విధానం అమలు చేస్తారు.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను 22వ తేదీ అందుబాటులో ఉంచనున్నారు. అదే రోజు సాయంత్రం వర్చువల్ సేవా టికెట్లు అందుబాటులోకి తీసుకువస్తారు.
అంగప్రదక్షిణం టికెట్లు 23వ తేదీ ఉదయం నుంచి అందుబాటులోకి తేనున్నారు. అదేరోజు ఉదయం 11 గంటలకు బ్రేక్ దర్శనం టికెట్లు విక్రయించనున్నారు. 23తేదీ సాయంత్రం వృద్దులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి ఉచిత దర్శనానికి టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు.
జులై 24వ తేదీ ఉదయం పది గంటలకు రూ.300 టికెట్లు, సాయంత్రం గదుల బుకింగ్ టికెట్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది.