ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో జరగనుంది. సమావేశానికి మంత్రులందరూ హాజరుకానున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు సూపర్ సిక్స్ పథకాల అమలుపై కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో పాలనపై ప్రజాస్పందనపై కూడా మంత్రివర్గ భేటీలో సమాలోచనలు చేయనున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, శ్వేతపత్రాల విడుదల గురించి భేటీలో చర్చించనున్నారు.
కేబినెట్ భేటీ తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో చంద్రబాబు సమావేశం అవుతారు.
వ్యవసాయం, ప్రజాపాలన, వాతావరణ పరిస్థితులు, సీజనల్ వ్యాధులు, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేయనున్నారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు దిల్లీ వెళ్లనున్నారు. దిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కావడంతో పాటు మరికొందరు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. ఈ నెల 3న దిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. పదిహేను రోజుల వ్యవధిలో దిల్లీకి చంద్రబాబు వెళ్ళడం ఇది రెండోసారి.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు