అడవి జంతువుల దాడుల పెరిగిపోవడంతో రొమేనియా పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరిగిపోయిన ఎలుగుబంట్లను తగ్గించేందుకు పార్లమెంట్ అత్యవసరంగా సమావేశమైంది. దేశంలో ఇటీవల కాలంలో ఎలుగుబంట్ల దాడులు పెరిగిపోయాయి. 20 ఏళ్లలో 26 మంది ఎలుగుబంట్ల దాడుల్లో చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇటీవల ఓ పర్వతారోహకుడిపై ఎలుగుదాడి చేసి చంపేయడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. దీంతో రొమేనియా పార్లమెంటు అత్యవసరంగా సమావేశమై 500 ఎలుగుబంట్లను చంపేయాలని తీర్మానం చేసింది.
రొమేనియాలో 8 వేల ఎలుగుబంట్లు ఉన్నాయని అంచనా. ఏటా వీటి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత ఏడాది 221 ఎలుగుబంట్లను చంపేశారు. అయినా వాటి దాడులు తగ్గడం లేదు. వాటి జనాభాను తగ్గించేందుకు 500ల ఎలుగులను చంపేయాలని నిర్ణయించారు.