కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డికె శివకుమార్‌కు అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. తనపై నమోదైన అక్రమాస్తుల కేసులను కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కర్ణాటక హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని సర్వోన్నత ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. 2013 నుంచి 2018 వరకు కర్ణాటక మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన రూ.74 కోట్లు అక్రమంగా సంపాదించారంటూ ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలంటూ కర్ణాటక హైకోర్టులో శివకుమార్ వేసిన పిటిషన్‌పై ఎదురుదెబ్బ తగలడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
డీకే శివకుమార్ మంత్రిగా పనిచేసిన సమయంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని, వాటి ద్వారా ఆయన ఆస్తులు అనూహ్యంగా పెరిగాయంటూ ఈడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసులను క్వాష్ చేయాలంటూ శివకుమార్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.