పరీవాహక ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో గోదావరి ఆధారిత జలాశయాల్లో వరద ఉద్ధృతి క్రమేణ పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 88,409 క్యూసెక్కులు వరద చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 10.30 అడుగులకు చేరింది. గోదావరి డెల్టాకు 10,200 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 78,209క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీలో మొత్తం 175 క్రస్ట్‌గేట్లకుగాను 129 గేట్లను తెరిచి నీటిని సముద్రంలోకి వదిలారు.
పశ్చిమ కనుమల్లో వర్షపాత విరామం కారణంగా కృష్ణా, దాని ఉపనదుల్లో వరద తగ్గింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 23,678 క్యూసెక్కులు నీరు చేరుతుండగా, విద్యుదుత్పిత్తి చేసి 3,980 క్యూసెక్కులు దిగువకు వదిలారు.
ఆల్మట్టి ప్రాజెక్టులో 90.33 టీఎంసీల నీరుంది. ఆల్మట్టి నిండేందుకు మరో 39 టీఎంసీలు అవసరం. కృష్ణాకు ప్రధాన ఉపనది అయిన తుంగభద్ర నదిలోను వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టులో నీటినిల్వ 31.7 టీఎంసీలకు చేరింది. తెలుగురాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలంలో నీటినిల్వ 36.24 టీఎంసీలకు తగ్గింది. నాగార్జునసాగర్‌లోకి వరద ప్రవాహం రావడం లేదు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు