జింబాబ్వే టూర్ లో భాగంగా ఆ జట్టుతో జరిగిన ఆఖరి ఐదో టీ20 మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. 42 పరుగులతో ఆతిథ్య జట్టును ఓడించి 4-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఆతిథ్య జింబాబ్వే జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో 18.3 ఓవర్లలో 125 పరుగులకే జింబాబ్వే జట్టు పెవిలియన్ కు చేరింది. 168 పరుగుల లక్ష్యానికి దారిదాపులకు కూడా చేరలేకపోయింది.
పేసర్ ముఖేశ్ కుమార్ 4 వికెట్లు తీయగా శివమ్ దూబే రెండు, తుషార్ దేశ్ పాండే , వాషింగ్టన్ సుందర్ , అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ తీశారు.
జింబాబ్వే జట్టులో డియాన్ మైర్స్ 34 పరుగులు చేయగా తదివనాషే మరుమని (27), ఫరాజ్ అక్రమ్(27) పరుగులు చేశారు. ఓపెనర్ వెస్లీ మదివెరే డకౌట్ కాగా… కెప్టెన్ సికిందర్ రజా (8), బ్రయాన్ బెన్నెట్ (10), జోనాథన్ క్యాంప్ బెల్ (4), వికెట్ కీపర్ క్లైవ్ మడాండే (1) దారుణంగా విఫలమయ్యారు.
భారత జట్టు తదుపరి పర్యటనలో భాగంగా శ్రీలంకలో ఆజట్టుతో ఆడనుంది. ఈ నెల 27 నుంచి శ్రీలంకలో టీ20 సిరీస్, ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.