మణిపూర్‌లో తిరుగుబాటుదారులు మరోసారి దాడికి తెగబడ్డారు. గస్తీలోని జవాన్లపై కాల్పులు జరపడంతో సీఆర్పీఎఫ్‌కు చెందిన కానిస్టేబుల్ మరణించాడు. జిరిబామ్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అస్సాం సరిహద్దు జిల్లాలో పారామిలిటరీ, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తుండగా తీవ్రవాదులు ఒక్కసారిగా దాడికి దిగారు. ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్ మరణించగా, ఆ వాహనంలో ఉన్న ఇద్దరు పోలీస్ కమాండోలకు గాయాలయ్యాయి. జవాన్లు ఎదురు కాల్పులు జరపడంతో తీవ్రవాదులు అడవిలోకి పారిపోయారు. దీంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
ఘటనపై సీఎం ఎన్ బీరెన్ సింగ్ స్పందించారు. సీఆర్పీఎఫ్ జవాన్‌ను హత్య చేయడాన్ని ఖండించారు. గాయపడిన పోలీస్ కమాండోలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.