అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడు క్రూక్స్‌ను పోలీసులు కాల్చి చంపారు. అయితే ఎవరీ క్రూక్స్ అనే ప్రశ్న తలెత్తుతోంది. రిపబ్లికన్ పార్టీకే చెందిన క్రూక్స్ ట్రంప్‌ను ఎందుకు టార్గెట్ చేశాడనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.పెన్సుల్వేనియాకు చెందిన క్రూక్స్ గతంలో రిపబ్లికన్ పార్టీకి 15 డాలర్ల
విరాళం కూడా ఇచ్చాడు. అయితే అతను ఇటీవల విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. రిపబ్లికన్ పార్టీలో ఆ వీడియోలో ధ్వేషం వెళ్లగక్కాడు.
డొనాల్డ్ ట్రంప్ సమావేశం నిర్వహిస్తోన్న ప్రాంతానికి 132 మీటర్ల దూరంలోని ఓ భవనంపై నుంచి క్రూక్స్ కాల్పులు జరిపాడు. ఆ భవనంలో ఓ కంపెనీ నడుస్తోందని పోలీసులు గుర్తించారు. కాల్పుల ఘటన జరగ్గానే పోలీసులు ఆ భవనాన్ని చుట్టుముట్టి అతన్ని మట్టుబెట్టారు. క్రూక్స్ నివశిస్తోన్న ఇంటి వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ వీధిలోకి ఎవరినీ అనుమతించడం లేదు. క్రూక్స్ గురించి మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన తరవాత ట్రంప్‌కు భారీగా రక్షణ పెంచారు.