ప్రొబెషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఆడీ కారును పుణె పోలీసులు సీజ్ చేశారు. ఖేద్కర్ ఆడి కారు 21 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడటం, వీఐపీల నెంబర్ ప్లేటు ఏర్పాటు చేసుకోవడం, ప్రభుత్వ స్టిక్కర్ వాడటంతో ఆమె వ్యవహారం వివాదానికి దారితీసింది. ఖేద్కర్ కారు డ్రైవర్ ఆడి తాళాలు పుణెలోని ఓ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే కారుకు సంబంధించిన పత్రాలు మాత్రం ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు.
ఇటీవల ఖేద్కర్ తల్లి ఓ రైతును తుపాకీతో బెదిరిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిపై కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఎవరూ అందుకోకపోవడంతో ఖేద్కర్ ఇంటికి అంటించారు. దృష్టి నిర్ధారణ పరీక్షలకు కూడా ఖేద్కర్ హాజరు కాలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై యూపీఎస్సీ కమిషన్లో పిటిషన్ వేసింది. దీనిపై కూడా విచారణ జరుగుతోంది.