తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యలో అనిమానితుడు తిరువెంగడం పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయాడు. కొద్ది రోజుల కిందట చెన్నై సెంబియం ప్రాంతంలో ఆర్మ్‌స్ట్రాంగ్ ఇంటి వద్ద కొందరు స్నేహితులతో మాట్లాడుతుండగా దుండగులు బైకులపై వచ్చి నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యలో ఆరుగురు పాల్గొన్నారని సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు.
నిందితుల కోసం గాలింపు చేసి చెన్నై పోలీసులు తిరువెంగడంను పట్టుకున్నారు. ఘటన తరవాత ఆయుధాలు దాచిన ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ పోలీసుల వద్ద తుపాకీ లాక్కుని కాల్పులకు తెగబడ్డాడని వారు చెప్పారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో తిరువెంగడం తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
తమిళనాడులో దళిత నేతగా ఆర్మ్‌స్ట్రాంగ్ ఎదుగుతున్నారు. 2006లో చెన్నై నగరానికి జరిగిన స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచాడు. 2 సంవత్సరాల కిందట బీఎస్పీ అధినేత మాయావతితో కలసి నగరంలో భారీ ర్యాలీ చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని మాయావతి డిమాండ్ చేశారు. తమిళనాడులో దళితులపై మారణకాండ కొనసాగుతోందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.