అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల దాడి ఘటనను భారతప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. తన స్నేహితుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగిందని తెలిసిన వెంటనే తీవ్ర ఆందోళన చెందినట్లు తెలిపారు. రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న ప్రధాని మోదీ, ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై శనివారం దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ ఘటన జరిగింది. ట్రంప్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని యూఎస్ సీక్రెట్ ఏజెంట్స్ క్షణాల్లోనే హతమార్చారు.
తనపై జరిగిన హత్యాయత్నంపై డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు. బుల్లెట్ కుడి చెవి పైభాగానికి తాకిందని, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తనను రక్షించారని తెలిపారు.
ట్రంప్‌పై దాడి ఘటనను దేశాధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. తమ దేశంలో హింసకు తావులేదన్నారు. ఇలాంటి రాజకీయ హింసను ముందెన్నడూ చూడలేదన్నారు.ల