ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారులను పెద్ద సంఖ్యలో బదిలీ చేశారు. 36 మంది ఐపీఎస్ అధికారులతోపాటు, ఒకరు నాన్ క్యాడర్ ఐపీఎస్ అధికారిని బదిలీ చేశారు. 23 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. చిత్తూరు జిల్లాకు ఎస్పీగా ఉన్న మణికంఠను కొనసాగించారు.
గత ఐదేళ్లలో వైసీపీ నేతలతో అంటకాగిన ఐపీఎస్‌ను డీజీపీ ఆఫీసుకు ఎటాచ్ చేశారు. వీరిలో గుంటూరు ఎస్పీగా పనిచేసిన హఫీజ్, శ్రీకాకుళం ఎస్పీగా పనిచేసిన రాధిక, కె.రఘువీరారెడ్డి, సిద్దార్థ్ కౌశల్, జగదీష్, సుమిత్ సునీల్ ఉన్నారు. వీరిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. కొద్ది రోజుల కిందటే విజయవాడ, విశాఖ నగరాల పోలీస్ కమిషనర్లను బదిలీ చేసి కొత్తవారిని నియమించారు.