సార్వత్రిక ఎన్నికల తరవాత జరిగిన మొదటి ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జులై 10న జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు 10 స్థానాల్లో గెలుపొందారు. 2 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవగా, ఒక స్థానంలో స్వతంత్ర్య అభ్యర్థి విజయం సాధించారు.
పశ్చిమ బెంగాల్లో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా అన్నీ స్థానాలను టీఎంసీ కైవసం చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్లో మూడు, ఉత్తరాఖండ్ రెండు, తమిళనాడు, మధ్యప్రదేశ్, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్ దేహ్రా నియోజకవర్గంలో సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు సతీమణి 9 వేల ఓట్ల మెజారిటతో విజయం సాధించారు. హమీర్పుర్లోనూ బీజేపీ అభ్యర్థి గెలిచారు.