Thursday, June 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

‘ముస్లిమేతర పిల్లలను మదరసాలకు పంపించవద్దు’

జమాతే ఉలేమా హింద్ అబద్ధాలను నమ్మకండి: ఎన్‌సిపిసిఆర్

Phaneendra by Phaneendra
Jul 13, 2024, 12:46 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇస్లాం మతబోధన కేంద్రాలైన మదరసాల్లో విద్యార్జనకు హిందువులు, ఇతర ముస్లిమేతరులు తమ పిల్లలను పంపించవద్దని బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్) అధ్యక్షుడు ప్రియాంక్ కనూంగూ విజ్ఞప్తి చేసారు. మదరసాల్లో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోందనీ, పిల్లలను మతం మారుస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనీ ఆయన హెచ్చరించారు.

ప్రియాంక్ కనూంగూ ఇవాళ సామాజిక మాధ్యమాల ద్వారా జారీ చేసిన ఒక ప్రకటనలో తన ఆందోళనలు వెలిబుచ్చారు. మదరసాలు ఇస్లామిక్ మతవిద్యను బోధించే కేంద్రాలు. అవి విద్యాహక్కు పరిధిలో లేవు. మదరసాల్లో ముస్లిమేతర విద్యార్ధులను చేర్పించుకోవడం ఆ చిన్నారుల మౌలిక రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు, సమాజంలో మతపరమైన విద్వేషాలను వ్యాపింపజేసే కారణం కూడా కాగలదు’’ అని ఆందోళన వ్యక్తం చేసారు.

ఆ సమస్యను నిలువరించడానికి, ప్రస్తుతం మదరసాల్లో చదువుతున్న ముస్లిమేతర విద్యార్ధులకు సాధారణ పాఠశాలల్లో చదువుకునే అవకాశాలు కల్పించాలని ఆయన రాష్ట్రప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఎన్‌సిపిసిఆర్ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసారని వివరించారు.

ప్రియాంక్ కనూంగూ మరో విషయంపైన కూడా ప్రజలను హెచ్చరించారు. ఇస్లామిక్ సంస్థ జమియాత్-ఎ-ఉలేమా-ఎ-హింద్ సంస్థ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని, ఆ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ చెప్పారు. ‘‘దేవబంద్‌కు చెందిన దారుల్ ఉలూం అనే ముస్లిం సంస్థ గజ్వా-ఎ-హింద్ (భారతదేశాన్ని ఆక్రమించడం) విధానాన్ని సమర్ధిస్తోంది. వారిపై కమిషన్ గతంలో చర్యలు తీసుకుంది. దాంతో దారుల్ ఉలూమ్ అనుబంధ సంస్థ అయిన జమియాత్-ఉలేమా-ఎ-హింద్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొడుతోంది’’ అని ఆయన హెచ్చరించారు.

ఉత్తరప్రదేశ్‌లోని దేవబంద్ వద్ద ఒక గ్రామంలో కొన్ని నెలల క్రితం ఒక హిందూబాలుణ్ణి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు, అతనికి సున్తీ కూడా చేసారు. ఆ విషయాన్ని ప్రియాంక్ ఉదాహరిస్తూ హిందూపిల్లలను లక్ష్యం చేసుకుంటున్నారని వివరించారు.   

‘‘పిల్లలకు కూడా మతస్వేచ్ఛ ఉంటుంది. దాన్ని ఎవరూ ఉల్లంఘించకూడదు. మతఛాందస సంస్థలు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దంటూ ప్రజలకు నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లల కోసం మంచి భవిష్యత్తును నిర్మించండి, వారి స్వేచ్ఛను కాలరాయకండి’’ అంటూ, తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరారు.

బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ అధ్యక్షుడు స్వయంగా చేసిన ఈ విజ్ఞప్తి, విద్యావాతావరణాన్ని మతమార్పిడి ముఠాలు ఎలా కలుషితం చేస్తున్నాయో, ఎంత ఆందోళనకరంగా మారుస్తున్నాయో తెలియజేస్తోంది. బాలల హక్కులు, వారి స్వేచ్ఛ విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో వివరిస్తోంది.

Tags: Jamiat-e-Ulema-e-HindMadrasaMuslim StudentsNCPCRNon-Muslim StudentsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట
general

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు
general

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?
general

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.