ఒక్కసారి పాము కాటేస్తేనే, సరైన వైద్యం అందకపోతే బతకడం కష్టం. ఉత్తరప్రదేశ్లో ఓ వింత చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ సమీపంలోని సౌరా గ్రామవాసి వికాస్ దూబేను ఇప్పటికి 7సార్లు పాములు కరిచాయి. చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో దుబే చికిత్స పొందుతున్నాడు. దుబే వారి కుటుంబ సభ్యులకు ఒక విషయం చెప్పడంతో వారంతా షాకయ్యారు.
తనకు ఓ కల వచ్చిందని, 9సార్లు పాములు కరుస్తాయని, 9వసారి కరిచిన తరవాత తాను ఇక బతకనని చెప్పాడు. ఇప్పటికే దుబేను 7సార్లు పాములు కరిచాయి. ఇంతలా పాములు దుబేను ఎందుకు కరుస్తున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. దుబే చెప్పే మాటలు విన్న డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏడుసార్లు పాము కాటుకు గురైన వ్యక్తులను మేం ఇంత వరకు చూడలేదని వారు చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుబే ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు.