నేపాల్లో ప్రచండ ప్రభుత్వం కుప్పకూలింది. శుక్రవారం జరిగిన బలపరీక్షలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ నేత పుష్ప కమల దహల్ ఆలియాస్ ప్రచండ ఓడిపోయారు. మొత్తం నేపాల్ పార్లమెంటులో 275 స్థానాలుండగా అధికారం దక్కాలంటే కనీసం 138 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. కాని ప్రచండకు కేవలం 63 మంది సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. దీంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది.
యునైటెడ్ మార్కిస్ట్ లెనినిస్ట్, నేపాలి కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కె.పి.శర్మ ఓలి, దేవ్ బా కూటమికి 167 మంది సభ్యుల బలముంది. ఆదివారం సాయంత్రానికల్లా బలనిరూపణ చేసుకోవాలని రాష్ట్రపతి రామచంద్ర పౌడల్ ఆదేశించారు. ఓలి 18 నెలలు, దేవ్ బా మరో 18 నెలలు పదవిని పంచుకోవడానికి వారి మధ్య ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. ఓలి రేపు సాయంత్రానికి బలనిరూపణ చేసుకునే అవకాశముంది.