దేశీయ స్టాక్ సూచీలు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. అంతర్జాతీయంగా అందిన సానుకూల ఫలితాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 622 పెరిగి 80519 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 186 పాయింట్లు పెరిగి 24502 వద్ద ముగిసింది. ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ నెలకొంది. పెట్టుబడిదారులు భారీగా కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో పలు షేర్లు దూసుకెళ్లాయి.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో హెచ్‌సిఎల్, యాక్సెస్ బ్యాంకు, టెక్ మహింద్రా, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి.మారుతి, కోటక్, ఏషియన్ పెయింట్స్, ఐసిఐసిఐ బ్యాంకు, టైటాన్ నష్టాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. బ్యారెల్ ముడిచమురు 83.15 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరలు దూసుకెళ్లాయి. ఔన్సు స్వచ్ఛమైన బంగారం 2407 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది.