ప్రముఖ నటి బీజేపీ మండి ఎంపీ కంగనా రనౌత్ తనను కలవడానికి వచ్చే వారు ఆధార్ కార్డు తెచ్చుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నియోజకవర్గ ప్రజలు ఏ సమస్యపై కలవాలనుకుంటున్నారో ముందుగా ఓ స్లిప్పై రాసి ఇవ్వాలని సూచించారు. దీని వల్ల ఎవరు ఏ సమస్యపై వస్తున్నారో తెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.
కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.ప్రజలు ఎంపీని కలవాలంటే ఆధార్ కార్డు అవసరం లేదని కాంగ్రెస్ నేత విజయేంద్ర సింగ్ విమర్శించారు. ఆధార్ కార్డు ఉంటే కలవడానికి అవకాశం ఇస్తామనడం అంటే ప్రజలను అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు.
ప్రజలు మనాలిలోని తన ఇంటికి వచ్చి కలవచ్చని, లేదంటే మండిలోని తన కార్యాలయంలో కలుసుకోవచ్చని కంగనా ప్రకటించారు. ఆమె నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ సెప్టెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన ఆస్తులన్నీ తనఖాపెట్టి ఈ సినిమా తీసినట్లు ఆమె చెప్పుకొచ్చారు.