ఎరువులు, పురుగుమందులతో పనిలేకుండా సాంప్రదాయ విత్తనాలతో సాగు విధానాలను ప్రోత్సహించినందుకు రైతు సాధికార సంస్థకు, రైతు నెట్టెం నాగేంద్రమ్మకు ప్రతిష్ఠాత్మక గుల్బెంకియన్ అవార్డు దక్కింది. ఏపీ సమాఖ్య ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహించినందుకు ఏపీసీఎన్‌ఎఫ్ ఈ అవార్డు దక్కించుకుంది.
రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ విజయ్‌కుమార్, సేంద్రీయ రైతు నాగేంద్రమ్మ భారత సంతతి అమెరికా శాస్త్రవేత్త రతన్ లాల్, ఈజిప్టునకు చెందిన స్వచ్ఛంద సంస్థ సెకెమ్‌కు అవార్డు దక్కింది. పోర్చుగల్‌లోని లిస్బన్‌లో ఈ అవార్డును ప్రధానోత్సవం చేశారు. అవార్డుతోపాటు లక్ష యూరోల నగదు బహుమతి ఇచ్చారు. 117 దేశాల నుంచి 181 మంది పోటీ పడగా మన రాష్ట్రానికి చెందిన రైతుకు అవార్డు దక్కడం విశేషం.
గుల్బెంకియన్ సంస్థ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు విశేషంగా కృషి చేస్తోంది. పర్యావరణాన్ని కాపాడటం, ఎరువులు, రసాయనాలు లేని సాగును ప్రోత్సహించే సంస్థలను, రైతులను గుర్తించి వారికి ఏటా అవార్డులు ప్రధానం చేస్తోంది.