నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాకేష్ రంజన్ అలియాస్ రాకీని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసారు. అతనికి పదిరోజుల సిబిఐ కస్టడీ విధించారు.
ఈ కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు బిహార్ రాజధాని పట్నా వద్ద రెండుచోట్ల, పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా దగ్గర మరో రెండుచోట్లా సోదాలు నిర్వహిస్తున్నారు.
నీట్ ఒక్కటే కాకుండా ఈ తరహా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసే జాతీయస్థాయి ముఠాను పట్టుకోడానికి వివిధ రాష్ట్రాల పోలీసులతో పాటు సిబిఐ అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికి డజనుకు పైగా వ్యక్తులను అరెస్ట్ చేసారు. అందులో సిబిఐ అరెస్టు చేసినవారు 8మంది ఉన్నారు. అరెస్టయిన వారిలో ఝార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ నగరానికి చెందిన ఒక పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు.
దేశవ్యాప్తంగా పరీక్షా పత్రాల లీక్ రాకెట్‌ను దర్యాప్తు చేస్తున్న సిబిఐ, నీట్ కేసులో ఇప్పటివరకూ ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది. అందులో ఐదు కేసులు బిహార్‌లోనివే కావడం గమనార్హం.
నీట్ పేపర్ లీకేజీ హజారీబాగ్ స్కూల్ నుంచే జరిగి ఉంటుందని సిబిఐ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది. ప్రశ్నాపత్రాల సీల్ ఓపెన్ చేసే సమయంలో రాకీ అక్కడే ఉన్నాడనీ, వాటిని అతను ఫొటోలు తీసుకుని బైటి వ్యక్తులకు చేరవేసాడనీ సిబిఐ నిర్ధారణకు వచ్చింది. బైటి వ్యక్తులు వాటిని పరీక్ష రాసే విద్యార్ధులకు లక్షల రూపాయలకు విక్రయించారు.
ఈ కుంభకోణంలో రాకీ కంటె ముఖ్యమైన వ్యక్తి మరొకడు ఉన్నాడు. అతని పేరు సంజీవ్ ముఖియా. అతను సుమారు ఇరవై ఏళ్ళుగా ఇదే ‘వృత్తి’లో ఉన్నాడు. అతనికీ రాకీకీ సంబంధాలున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న సంజీవ్‌ను పట్టుకోడానికి సిబిఐ ప్రయత్నిస్తోంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు