మద్యం విధానం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత ధర్మాసనం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ మూడు నెలలుగా తిహార్ జైల్లో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు 20 రోజుల పాటు మధ్యంతర బెయిల్ పొందారు. ఎన్నికల ప్రచారం పూర్తి కాగానే జూన్ 3న తిహార్ జైల్లో లొంగిపోయారు. బెయిల్ కోసం కేజ్రీవాల్ పెట్టుకున్న పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా కేజ్రీవాల్‌కు షరతులతో కూడా మధ్యంత బెయిల్ లభించింది.