ఆధునిక సమాజంలో లింగమార్పిడి వ్యవహారాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జెండర్ మార్చుకోవడం, దాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం భారతదేశంలో మొదటిసారి జరిగింది.
ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి తన జెండర్ మార్చుకున్నారు. ఆ మేరకు అన్ని ప్రభుత్వ రికార్డులలోనూ తన పేరు, జెండర్ మార్చాలని కోరారు. దానికి కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. ఆ మహిళా అధికారి పేరు, జెండర్ మార్చడానికి ఒప్పుకుంది. భారతదేశపు సివిల్ సర్వీసెస్‌లో ఇటువంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి.
తమిళనాడుకు చెందిన ఎం అనసూయ (35) హైదరాబాద్‌లోని చీఫ్ కమిషనర్ (ఆదరైజ్డ్ రిప్రెజెంటేటివ్) ఆఫ్ ది కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ టాక్స్ అప్పెలేట్ ట్రైబ్యునల్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తన పేరు, జెండర్ మార్చాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు విన్నవించుకున్నారు. ఎం అనసూయ బదులు తన పేరును ఎం అనుకతిర్ సూర్య, తన జెండర్‌ను మహిళ నుంచి పురుషుడిగానూ మార్చాలని ఆమె కోరారు.
‘‘మిజ్ ఎం అనసూయ విజ్ఞప్తిని మేం పరిశీలించాం. ఇకపై ఆ అధికారి అన్ని అధికారిక రికార్డులలో మిస్టర్ ఎం అనుకతిర్ సూర్య అనే పేరుతో వ్యవహరించబడతారు’’ అని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అనుకతిర్ సూర్య అలియాస్ అనసూయ కెరీర్ 2013 డిసెంబర్‌లో చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్‌గా మొదలైంది. గతేడాది హైదరాబాద్‌లో జాయింట్ కమిషనర్ హోదా లభించింది. అనుకతిర్ సూర్య చెన్నైలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో పట్టా పుచ్చుకున్నారు. 2023లో భోపాల్‌లోని నేషనల్ లా ఇనిస్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా చేసారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు