అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. దేశీయంగా సానుకూల సంకేతాలు వెలువడటంతో స్టాక్ మార్కెట్లో ప్రారంభం నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించింది. బ్లూచిప్ స్టాక్స్ లాభాలార్జించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 80397, నిఫ్టీ 24,433 పాయింట్ల గరిష్ఠాలను తాకింది. ఇవాళ ఉదయం 80107 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్, ముగిసే సమయానికి 391 పాయింట్లు పెరిగి 80351 వద్ద రికార్డు నమోదు చేసింది. నిఫ్టీ 112 పెరిగి 24433 పాయింట్ల వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో మహీంద్రా బ్యాంక్, టైటాన్, ఐటీసీ, మహీంద్రా లాభపడ్డాయి. కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ నష్టపోయాయి. ముడిచమురు ధర స్వల్పంగా పెరిగి బ్యారెల్ 85.47 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్సు స్వచ్ఛమైన బంగారం ధర 2370 యూఎస్ డాలర్లుగా ఉంది.