ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గం ఈ నెల 16న సమావేశం కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది.
ఈ నెల 22 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 16న జరిగే కేబినెట్ భేటీలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జులై 31 వరకు ఉంటుంది. దీంతో, ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. సెప్టెంబరులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.