తిరుపతి నగరంలో అతిసార వ్యాధి విజృంభించింది. పద్మావతిపురం పాస్ మనోవికాసకేంద్రంలో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు మరణించారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు ప్రకటించారు.
ఏపీలో డయేరియా భారిన పడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇటీవల విజయవాడలోనూ పలు కాలనీల్లో కలుషిత నీరు తాగి 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. గుంటూరులోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. డయేరియా కారణంగా గుంటూరులో నలుగురు చనిపోయారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోనూ డయేరియా కారణంగా ఇద్దరు చనిపోయారు. పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కావడం అతిసారకు కారణంగా అధికారులు గుర్తించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు