హథ్రస్ తొక్కిసలాటలో 121 మంది చనిపోయిన ఘటనపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం ( సిట్) ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ దాస్‌కు నివేదిక సమర్పించింది. అధికారుల నిర్లక్ష్యం ఉందని సెట్ తేల్చింది. సబ్ డివిజినల్ అధికారి, తహసీల్దార్, పోలీసు అధికారులు సహా ఆరుగురుని ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. భోలేబాబా ప్రతివారం నిర్వహించే శివారాధనకు 80 వేల మంది భక్తులు వస్తారని అనుమతులు తీసుకున్నారు. అంచనాలను మించి 2.5 లక్షల మంది భక్తులు హాజరయ్యారని సిట్ నివేదికలో వెల్లడించింది.
అనుమతులు ఇచ్చే ముందు కనీసం అధికారులు సత్సంగ్ ప్రాంతాన్ని కూడా సందర్శించలేదని సిట్ అధికారులు తేల్చారు. అటు రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే 121 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలో పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై యూపీ ప్రభుత్వం వేటు వేసింది. ఆరుగురు అధికారులను విధుల నుంచి తొలగించింది.