అమెరికాలో అక్రమంగా పనిచేయించుకుంటోన్న నలుగురు తెలుగోళ్లను ప్రిన్స్టన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రిన్స్టన్లోని గిన్స్బర్గ్ లేన్‌లో ఓ అపార్టుమెంటులో అక్రమంగా కట్కూరి సంతోష్ భార్య ద్వారక పనిచేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులకు అందిన సమాచారంతో తనిఖీలు నిర్వహించి 15 మంది కార్మికులను గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా వారితో పనిచేయించుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అక్రమంగా పని చేయించుకుంటోన్న కట్కూరి సంతోష్, ఆయన భార్య ద్వారక సహా, వీరికి సహకరించిన దాసిరెడ్డి చందన్, మాలె అనిల్‌లను అరెస్ట్ చేశారు. వీరిని విచారించిన పోలీసులు మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లోనూ దాడులు చేసి వంద మంది కార్మికులతో అక్రమంగా పని చేయించుకుంటున్నట్లు తేల్చారు.