వైద్య విద్యలో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షల్లో, ప్రశ్నా పత్రాలు లీకైన మాట వాస్తవమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ఫలితాలపై కొందరు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లపై ఇవాళ విచారణ చేపట్టింది. నీట్ ప్రశ్నాపత్రం ఎంత మందికి చేరింది అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్ పరీక్షల నిర్వహణపై దేశ వ్యాప్తంగా అనేక కోర్టుల్లో నమోదైన కేసులన్నీ సుప్రీంకోర్టు ఒకే కేసుగా పరిగణించి విచారణ చేపట్టింది.
నీట్ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో బిహార్ పోలీసులు ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారు. నీట్ ప్రశ్నా పత్రాల లీక్ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. నీట్ పరీక్షలు రద్దు చేయాలని ఎన్ని డిమాండ్లు వచ్చినా కేంద్రం అంగీకరించలేదు. లక్షలాది మంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నీట్ పరీక్షల్లో ఒకటో ర్యాంకు 67 మందికి రావడం, ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసిన వారిలో 8 మందికి ఒకే ర్యాంకు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించిన నీట్ పరీక్షల్లో డొల్లతనం బయటపడింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు