కిడ్ని దొంగల ముఠా అరాచకం విజయవాడలో మరోసారి వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన మధుబాబును విజయవాడకు చెందిన బాషా అనే వ్యక్తి కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇస్తామంటూ ఒప్పించాడు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న మధుబాబు అందుకు అంగీకరించాడు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి మధుబాబుని తీసుకెళ్లి కిడ్నీ కాజేశారు. ఆ తరవాత అతనికి కేవలం లక్షా 10 వేలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన డబ్బు ఇవ్వాలని అడగ్గా, నీవు కిడ్నీ దానం చేశావంటూ బెదిరింపులకు దిగడంతో వ్యవహారం పోలీసులకు చేరింది.
బాధితుడు మధుబాబు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తన కిడ్నీ కాజేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాషా గతంలోనూ కిడ్నీ రాకెట్ నడిపాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బాషా కోసం పోలీసులు గాలిస్తున్నారు.