అతి భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి 6 గంటల పాటు ఏకధాటిగా కుండపోత వర్షాలు కురిశాయి. ఆరు గంటల్లోనే 300 మి.మీ రికార్డు వర్షపాతం నమోదైంది. ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై మోకాళ్లోతు నీరు నిలిచింది. ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. సబర్భన్ రైళ్లు రద్దు చేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
ముంబై నగరాన్ని అతి భారీ వర్షాలు ముంచాయి. ఎన్నడూ లేని విధంగా ఆరు గంటల్లోనే 30 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో నగరంలో ఎక్కడ చూసినా వరద నీరు కనిపిస్తోంది. అనేక ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.