పూర్తిగా నయం చేసేందుకు మందులు లేని హెచ్ఐవి నుంచి రక్షణ కల్పించే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. లెనాకాపావిర్ అనే మందును ఇంజెక్షన్ రూపంలో ఏటా రెండు సార్లు తీసుకుంటే హెచ్ఐవి నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఉగాండా, దక్షిణాఫ్రికా దేశాల్లో వేలాది మందిపై జరిపిన క్లినికల్ పరీక్షల్లో సత్ఫలితాలు వచ్చాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న మాత్రల మందుల కంటే ఇది అత్యంత మెరుగ్గా పనిచేసినట్లు వెల్లడైంది.
హెచ్ఐవి వైరస్‌కు రక్షణ కల్పించే ప్రొటీన్ కవచాన్ని కాస్పైడ్ అంటారు. కొత్తగా తయారు చేసిన మందు ప్యూజన్ కాస్పైడ్గా పనిచేస్తుంది. వైరస్‌కు రక్షణగా ఉన్న ప్రొటీన్ కవచాన్ని ఈ మందు లక్ష్యంగా చేసుకుంటుందని క్లినికల్ పరీక్షల్లో వెల్లడైంది. ఆఫ్రికాలో లక్షలాది మంది హెచ్ఐవి బారిన పడటంతో అక్కడ నివశించే 16 నుంచి 25 మధ్య యువతపై క్లినికల్ పరీక్షలు నిర్వహించారు. సత్ఫలితాలు రావడంతో హెచ్ఐవిపై పరిశోధనల్లో ముందడుగు పడినట్లైంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు