అక్రమంగా తరలిస్తోన్న బంగారాన్ని డీఆర్ఐ అధికారులు హైదరాబాద్లో స్వాధీనం చేసుకున్నారు. కోల్కతా నుంచి బస్సులో హైదరాబాద్ తరలిస్తోన్న ముఠా నుంచి 4 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. ముందుగా అందిన నిఘావర్గాల సమాచారంతోనే డీఆర్ఐ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది.
అక్రమంగా పన్నులు చెల్లించకుండా హైదరాబాద్కు పెద్ద ఎత్తున బంగారం తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.2 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.విదేశాల నుంచి అక్రమంగా కోల్కతా తరలించి అక్కడి నుంచి దేశంలోని వివిధ నగరాలకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.