జార్ఖండ్ లో దారుణం జరిగింది. గుజరాత్‌లోని సూరత్ లో శనివారం మధ్యాహ్నం ఆరంతస్తుల భవనం కూలి ఏడుగురు మరణించిన ఘటన మరువకముందే, జార్ఖండ్ లోనూ అదే తరహా ప్రమాదం జరిగింది. డియోగఢ్‌లో ఆదివారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కూలింది.
సమాచారం అందిన వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు సహాయ చర్యలు చేపట్టారు. భవన శిథిలాల నుంచి ఇద్దరు క్షతగాత్రులను బయటకు తీశారు. మరికొంత మంది శిథిలాల కిందే ఉన్నారని అనుమానిస్తున్నారు. దీంతో సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. కూలిన భవనంలో కొన్ని రోజులుగా మరమ్మతులు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితులను కాపాడటమే మొదటి ప్రాధాన్యంగా పనిచేస్తున్నామన్నారు.
గుజరాత్ రాష్ట్రం సూరత్ లో ఉన్న సచిన్ పాలి లో శనివారం ఆరు అంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడ్డారు. 2017లో నిర్మించిన అపార్ట్ మెంట్ శిథిలావస్థకు చేరింది. 30 ఫ్లాట్లు ఉండగా అందులో ఐదు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బాగా నానిన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
ప్రమాద సమయంలో నైట్ డ్యూటీలు ముగించుకున్న వారు నివాసాల్లో నిద్రిస్తున్నారు. సూరత్ లోని వస్ర్త పరిశ్రమలో పనిచేసే యూపీ, బీహార్ కు చెందిన కార్మికులు భవనంలో నివసిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే సందీప్ దేశాయ్ తెలిపారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు