కేంద్ర బడ్జెట్ సమావేశాలు జులై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. 23న కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆగష్టు 12 వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రతిపాదనలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు సభా వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ బడ్జెట్ ప్రవేశ పెడితే ఆర్థిక మంత్రి నిర్మలా ఏడవది ప్రవేశపెట్టినట్లవుతుంది. గతంలో సి.డి. దేశ్‌ముఖ్ మాత్రమే ఇన్ని దఫాలు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ప్రపంచ అగ్రదేశాలతో భారత్ పోటీ పడేవిధంగా విధానాలు రూపొందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంతో బడ్జెట్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ప్రతిపక్షాలు కూడా దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ఇప్పటికే ముగిసిన సమావేశాల్లో నీట్, మణిపుర్ అల్లర్లు, అగ్నివీర్‌పై ప్రతిపక్షాలు ప్రత్యేక చర్చకు డిమాండ్ చేశాయి. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీ దూకుడుగా వ్యవహరించడంతో, ఎన్డీయే కూటమి నేతలకు ప్రధాని మోదీ కొన్ని సూచనలు చేశారు. ఇక రాబోయే బడ్జెట్లో జీఎస్టీలో కొన్ని మార్పులు ఉండవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.