నటుడు రాజ్‌తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని, శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సమర్పించాలంటూ లావణ్యకు నోటీసులు జారీ చేశారు. 11 సంవత్సరాలపాటు లావణ్యతో సహజీవనం చేసిన మాట వాస్తవమేనని, అయితే ఐదేళ్లుగా ఆమెతో ఎలాంటి సంబంధం లేదని రాజ్‌తరుణ్ మీడియాకు వెల్లడించారు.
లావణ్య డ్రగ్స్‌కు అలవాటు పడిందని, తనను బ్లాక్మెయిల్ చేస్తోందని రాజ్‌తరుణ్ ఆరోపిస్తున్నారు. లావణ్య వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోందని రాజ్‌తరుణ్ చెబుతున్నారు. నటుడు రాజ్ తరుణ్ ఓ యువ నటితో సహజీవనం చేస్తూ, తనకు అన్యాయం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.